ఈ దసరా సెలవులకు కుటుంబంతో కలిసి వెళ్ళలిసిన బెస్ట్ వాటర్ పార్క్స్
Best Vacation Places For Family & Friends in Hyderabad For This Dussehra
హైదరాబాద్ అనగానే మనకు గుర్తు వచ్చేది చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, హుస్సేన్ సాగర్ లాంటి ఆకర్షణలు. అయితే ఇవి మాత్రమే కాక హైదరాబాద్ లో ఇంకా ఆకర్షణలు ఉన్నాయి. అవే వాటర్ పార్క్స్. ఈ వాటర్ పార్క్స్ లో ఆనందం తో పాటు వినోదం కూడా ఉంటుంది. చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా పెద్ద వాళ్లకి కూడా ఇక్కడ వినోదం అలానే ఉంటుంది. ఈ వాటర్ పార్క్స్ లో రైడ్స్ అలాంటివి మరి. వాటర్ రైడ్స్, అడ్వెంచర్ రైడ్స్, రైన్ డాన్స్, లైట్ షోస్, మ్యూసికల్ షోస్ లాంటి మరిన్ని వినోదాలు ఉంటాయి.
ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ అయిదు వాటర్ పార్క్స్ చూద్దాం.
1. వండర్ లా
వండర్ లా హైదరాబాద్ లోనే అత్యంత ప్రముఖ వాటర్ పార్క్. ఇది హైదరాబాద్ సిటీ నుండి 25 KM ల దూరం లో ఉన్న రావిర్యాల లో ఉంది. ఇది అతి పెద్ద వాటర్ పార్క్. ఇందులో చాలా రకాల వాటర్ రైడ్స్ మరియు అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి. ఈ వండర్ లా చాలా వినోదాన్ని ఇస్తుంది. అంతే కాక ఇది చిన్న పిల్లలకు మంచి రైడ్స్ ని అందిస్తోంది. ఇందులో రోలర్ కోస్టర్ రైడ్ వినూత్నమైనది. అది చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఉంటుంది.
ఇండియా లో ఎక్కడా లేని మిషన్ ఇంటర్ స్టెల్లార్ అనే రైడ్ వండర్ ల లో మాత్రమే ఉంది. దీనికి 50 కోట్ల బడ్జెట్ ను వెచ్చించి డిజైన్ చేసారు. ఈ రైడ్ ఒక డోమ్ తో క్లోజ్ చేసే థియేటర్ లో ఉంటుంది. ఇది ఒక స్పేస్ ట్రిప్ రైడ్.
ఇక్కడ వీకెండ్స్ లో ప్రైస్ ఆఫర్ ఉంటుంది. సాధారణ ఎంట్రీ టిక్కెట్టు మరియు ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ టిక్కెట్టు ఉంటాయి. అయితే సాధారణ ఎంట్రీ టిక్కెట్టు తో రైడ్స్ లో వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది అదే ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ టిక్కెట్టు తో వెయిటింగ్ అవసరమే లేకుండా నేరుగా రైడ్ దెగ్గరికి వెళ్లిపోవచ్చు.
ఈ వండర్ లా లో ప్రవేశ సమయం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:00 గంటలకు ఉంటుంది. సాయంత్రం 6:00 గంటల వరకు వినోదాలు చూడవచ్చు. అదే శనివారం మరియు ఆదివారం అయితే ఉదయం 11:00 గంటలకు ప్రవేశం అయ్యి సాయంత్రం 7:00 గంటల వరకు రైడ్స్ చేయవచ్చు.
ప్రవేశ టిక్కెట్టు ధర పెద్దలకు ఒక టిక్కెట్టు ధర రూ. 770 పిల్లలకు మరియు సీనియర్ సిటిజన్లకు ఒక టిక్కెట్టు ధర రూ. 620. అదే చిన్న పిల్లలకు సాధారణ రోజులు ఐన రద్దీ రోజులు ఐన ఒక టిక్కెట్టు ధర రూ. 150 ఉంటుంది. సాధారణ రోజుల్లో పెద్దలకు ఒక టిక్కెట్టు ధర రూ. 990, పిల్లలకు మరియు సీనియర్ సిటిజన్లకు ఒక టిక్కెట్టు ధర రూ.810 ఉంటుంది.
గమనిక: ఇక్కడికి నైలాన్ క్లోత్ లో మాత్రమే దుస్తులు దరించి రావాలి. అంటే స్విమ్ సూట్, బాడీ సూట్, షార్ట్స్ మరియు టాప్స్ లాంటివి.
2. ఎస్కేప్ వాటర్ పార్క్
ఎస్కేప్ వాటర్ పార్క్ రాళ్లగూడ రోడ్, RGIA పోలీస్ స్టేషన్ పక్కన లేన్ శంషాబాద్ లో ఉంది. ఇక్కడ వాటర్ రైడ్స్ చాలా ఉన్నాయి. వాటర్ గేమ్స్, స్లైడ్స్ లాంటి రైడ్స్ మనస్సును ని ఆహ్లాద పరుస్తాయి. అంతే కాక ఇది పిల్లలకు మంచి ఎంటర్టైన్మెంట్ జోన్.
ఇది ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ వాటర్ పార్క్ ఎంట్రీ టిక్కెట్టు ధర రూ. 460 ఉంటుంది.
గమనిక: ఇక్కడకి వచ్చే వాళ్ళు నైలాన్ స్విమ్ సూట్ వేసుకుని రావాలి
3. లియో స్ప్లాష్
కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న లియో స్ప్లాష్ ఒక మంచి వాటర్ పార్క్. ఇందులో వాటర్ రైడ్స్, స్లైడ్స్ చాలా ఉన్నాయి అవి పిల్లలకు మంచి కాలక్షేపం అని చెప్పచ్చు. అంతే కాక ఇందులో ఉన్న ప్రత్యేకత సర్ఫింగ్ రైడ్ దే.
ఉదయం 10:00 గంటల నుండి 6:00 గంటల వరకు రైడ్స్ ను ఎంజాయ్ చేయచ్చు. ఇక్కడ ప్రవేశ టిక్కెట్టు ధర ఒక వ్యక్తికి రూ. 499.
4. జలవిహార్ వాటర్ పార్క్
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉన్న జలవిహార్ వాటర్ పార్క్ ప్రసిద్ధమైనది. ఇక్కడ మంచి మంచి పిల్లల రైడ్స్ ఉంటాయి. అత్యంత పెద్ద వాటర్ పార్క్స్ లో ఇది ఒకటి. ఇక్కడ పెండ్యులం రైడ్, టిల్ట్ బకెట్ లాంటి ప్రత్యేకమైన రైడ్ లు ఉన్నాయి . టిల్ట్ బకెట్ చాలా ఫన్నీ రైడ్. ఈ రైడ్ లో ఒక బకెట్ నిండు గా ఉన్న వాటర్ రివర్స్ లో మన మీద పడతాయి. ఇక్కడ బయట నుండి ఫుడ్ అల్లఓ చేయరు. ఫుడ్ కోర్ట్ లో తాలీ, మందీ, బిర్యానీ, చైనీస్ లాంటి రక రకాల ఫుడ్ ఉంటుంది.
ఇక్కడి రైడ్స్ ను ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఎంజాయ్ చేయచ్చు. ప్రవేశ టిక్కెట్టు ధర ఒకరికి రూ. 300.
గమనిక: ఇక్కడ నైలాన్ బాడీ సూట్స్, స్విమ్ వేర్, లెగ్గింగ్స్ లాంటి దుస్తులు మాత్రమే వేసుకోవాలి.
5. వైల్డ్ వాటర్స్
హైదరాబాద్ లోనే ప్రసిద్ధి చెందిన వాటర్ పార్క్స్ లో వైల్డ్ వాటర్స్ ఒకటి. ఇందులో ప్రత్యేకమైన వాటర్ రైడ్స్ మరియు ల్యాండ్ రైడ్స్ 60 కు పైగానే ఉన్నాయి. ఈ వాటర్ పార్క్ పిల్లలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇక్కడ పిల్లలకు, పెద్దలకు కూడా చాలా వినోదం ఉంటుంది.
ఈ వాటర్ పార్క్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది. శనివారం మరియు ఆదివారం మాత్రం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఉంటుంది.
ఇక్కడ ప్రవేశ టిక్కెట్టు ధర సాధారణ రోజుల్లో పెద్దలకు రూ. 690 మరియు పిల్లలకు రూ. 590. అదే ప్రత్యేక రోజుల్లో టిక్కెట్టు ధర పెద్దలకు రూ. 790 మరియు పిల్లలకు ఒక టిక్కెట్టు ధర రూ. 690.
గమనిక: ఇక్కడ నైలాన్ కానీ పాలిస్టర్ కానీ స్విమ్ సూట్స్ మాత్రమే ధరించాలి.
పిల్లల సెలవుల సమయం లో ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన వస్తేయ్ కచ్చితంగా ఈ వాటర్ పార్క్స్ మంచి టూర్ అనే చెప్పచ్చు. ఇక్కడ ఉన్న వినోదాలు మంచి టైం పాస్ ను ఇస్తాయి. పిల్లలకు మంచి హాలిడే ట్రిప్ అవుతుంది. ఈసారి హాలిడేస్ కు ఈ వాటర్ పార్క్స్ విసిట్ ను ప్లాన్ చేయండి.